కెసిఆర్ సరదాగా అంటే దుబ్బాక ప్రజలు సీరియస్ గా తీసుకున్నారు..దుబ్బాక లో ప్రకాష్ రాజ్ ఎవరో..పవన్ కళ్యాణ్ ఎవరో చెప్పక్కర్లేదు అనుకుంట . జల్సా లో ఒక డైలాగ్ ఉంది అదేమిటి అంటే నువు నా షర్ట్ గుండి కూడా తీయ్యలేవు అంటే పవన్ కళ్యాణ్ పీకి చూపిస్తాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ నేను జోక్ గా అన్నారా అంటే నేను మాత్రం సీరియస్ గా తీసుకున్న అని పవన్ కళ్యాణ్ అంటాడు . దుబ్బాక ప్రజలు కూడా అంతే అప్పుడు కెసిఆర్ ఏదో సరదాగా అంటే కానీ దుబ్బాక ప్రజలు సీరియస్ గా తీసుకున్నారు . కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులను కెసిఆర్ ప్రభుత్వం తిప్పికోట్టింది . దానికి సమాధానం ప్రజలు ఓట్లతోనే చెప్పరు. దుబ్బాకలో తెరాస కంచు కోటని బద్దలు కొట్టి బీజేపీ జెండా ని ఎగరవేశారు .
