respect women
tv24studio.com

చరిత్ర చదివి తెలుసుకోవాలి ఆడదంటే అర్థం..
చరిత్ర కావలి అంటే ఆడతనాన్ని గౌరవించాలి..

ఛత్రపతి శివాజీ గారు ఒక సుల్తాన్ రాజ్యం పై యుద్ధానికి వెళ్ళి ఆ సుల్తాన్ ఓడిపోయి రాజ్యాన్ని వదిలి పారిపోయారు
అప్పట్లో యుద్ధం గెలిచాక వారికి నచ్చితే అంతఃపుర స్త్రీలు నచ్చితే వారిని కూడా సొంతం చేసుకొనేవారంట….

అప్పట్లో యుద్ధం గెలిచాక వారికి నచ్చితే అంతఃపుర స్త్రీలు నచ్చితే వారిని కూడా సొంతం చేసుకొనేవారంట

సుల్తాన్ రాజ్యాన్ని శివాజీ గెలిచాక అయన సైనికులు సుల్తాన్ భార్యను శివాజీ కోసం బంధించారు.
ఆవిడా అందాల రాశి అని అందరికి తెలుసు
ఆమెను పల్లకిలో ఎక్కించుకుని శివాజీ ఉన్న రాజ్యంలోకి తీసుకువచ్చి ఉంచారు

శివాజీ యుద్ధ సన్నివేశాలు..
యుద్ధం లో గెలిచినా వారు ఓడినా వారి భార్యలని పల్లకిలో తీసుకొచ్చే దృశ్యం..

అయన అంతఃపురంలోకి వెళ్తూ బయట పల్లకి ఉండడం గమనించి సైనికాధ్యక్షుడిని ఎవరని అడిగారు
రాజా ఆవిడ సుల్తాన్ గారి మహారాణి
అందాల రాశి ఆవిడను ఈరోజు మీకు విందుకు తెచ్చాము అన్నారు
అయన పల్లకి వైపు వెళ్ళి తెర తీయగా భయంతో మహారాణి
ఆవిడతో శివాజీ చెప్పిన మాటలు
అమ్మా నిజంగానే అందరూ అంటున్నట్టు మీరు అందాల రాశి
ఒకవేళ నేను మీ కడుపున పుట్టి ఉంటె నేను అందగాడినయ్యేవాడినేమో అమ్మా అన్నారు

యుద్ధం లో ఓడిన ఓ సుల్తాన్ గారి భార్య రాణి గారు..

ఆ మాటలకూ ఆవిడ రెండు చేతులు జోడించి నమస్కరించారు
ఆ మాట విన్న సైనికులు ఆశ్చర్యపోయారు
ఆడవారిని గౌరవించడం మనకర్తవ్యం
ఇంకెప్పుడు ఇటువంటి పొరపాట్లు చేయకండి
ఆవిడను భద్రంగా తీసుకెళ్లి ఆవిడ ఎక్కడ వదల మంటే అక్కడ ఆవిడను జాగ్రత్తగా విడిచి రండి అని
చెప్పారు శివాజీ

తప్పు తెలుసుకొని ఆవిడని వదిలెయ్యమని ఆజ్ఞాపించటం..

ఇలాంటి మాటలు ఇప్పటి కాలంలో వినగలుగుతున్నామా
అసలు ఎవరైనా అంటున్నారా
ఇలాంటి విషయాలు కదా పాఠ్యపుస్తకంలో ఉండవలసింది
అయన ఎవరిపైన యుద్ధం చేసాడు ఎవరినీ ఓడించాడు
ఎవరి దగ్గర ఓడిపోయాడు అనేవి ఏమి నేర్పిస్తున్నాయి

పాఠ్య పుస్తకాలలో లేకపోయినా కనీసం మనవంతు బాధ్యతగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు అయినా కధలు రూపం లో,అమ్మ విలువ ,ఆడదాని విలువ ,ఆడతనాన్ని ఎలా గౌరవించాలో పిల్లలకి తెలియచేయాలి..
ఇలా చేస్తే అన్న వాళ్ళ మనుసులో అమ్మ,అక్క,చెల్లి అనే విలువలు తెలిపి, అరాచకాలు అరికట్టినవాళ్ళం అవుతాము..