Interesting back ground for pawan kalyan 28th movie

‘గబ్బర్ సింగ్’ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటికీ ఓ మాస్టర్ పీస్ లా నిలిచిపోయే సినిమా ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. రాజకీయాలను బాలన్స్ చేస్తూనే పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా వరుసగా సినిమాలను అనౌన్స్ చేశారు. అందులో అందరి అంచనాలను పెంచేసిన కాంబినేషన్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ 28వ సినిమా…

జస్ట్ కాన్సెప్ట్ పోస్టర్ మాత్రమే రిలీజైన ఈ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. హరీష్ శంకర్ కూడా చాలా టైం తీసుకొని గబ్బర్ సింగ్ కి మించి హిట్ కొట్టేలా, కథని పక్కాగా సిద్ధం చేస్తున్నారు. మాకు తెలిసిన ఎక్స్ క్లూజివ్ సమాచారం ప్రకారం, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమాలో కథానుగుణంగా కోల్ కతా బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నారు. అలాగే సినిమాలో చాలా భాగం షూటింగ్ కోల్ కతాలోనే చేయనున్నారు. పవన్ కళ్యాణ్ గారూ ఖుషి సినిమా ఇంట్రడక్షన్ కూడా కోల్ కతా లో జరిగిందే..

ఇవి మాత్రమే కాకూండా మరో న్యూస్ ఏంటంటే, ఈ సినిమా ప్రస్తుతంలో జరిగే కథ కాదట.. కొన్ని సంవత్సరాల క్రితం జరిగే ఓ పీరియాడిక్ ఫిల్మ్ గా పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ఫిల్మ్ ఉండనుందట. సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ 28వ సినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ పాత్రతో పాటు అదిరిపోయే మెసేజ్ తో పీరియాడిక్ ఫిల్మ్ గా రానుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని సమాచారం , మరి ఖుషీలాంటి హిట్ అవుతుందో లేక అంతకుమించి అవుతుందో చూడాలి…