నెల్లూరు వరద ప్రాంతాల్లో పర్యటించిన జనసేన నాయకుడు కేతంరెడ్డి..గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నివర్ తూఫాన్ బీభత్సం సృష్టించింది..చేతికి వస్తుంది అనుకున్న పంట నీళ్ల మాయం అయ్యిపోయింది. ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు కోసం వచ్చే నాయకులు ,ప్రజలు ఇలా వరద నీటిలో మునిగిపోతుంటే పట్టించుకున్న నాయకుడు ఒక్కడు లేడు.. ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుంటే ప్రజలు ఎక్కడికి పోవాలో తెలియక వరద నీటిలో ఉండిపోయి , తిండి ,తిప్పలు లేక అల్లాడిపోతున్నారు..ఇటువంటి సమయంలో ప్రజలకు మేము ఉన్నాం అంటూ జనసేన నాయకులు ప్రజల గురించి ,వాళ్ళ ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు.. నెల్లూరు నియోజక వర్గానికి చెందిన జనసేన ఇంచార్జి కేతంరెడ్డి వినోద్ రెడ్డి , వరద ప్రాంతాలకి వెళ్లి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు.
