తిరుపతి ఉపఎన్నిక బలంగా ఉన్న జనసేన..? బీజేపీ ఏం చేయబోతుంది..అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో గట్టిగ ఉంది. ఆలు లేదు పోలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు దుబ్బాక లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ గెలవటం తో ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లో జరగబోయే ఉపఎన్నికల్లో కూడా బీజేపీ గెలవబోతున్నది అనే ప్రచారం గట్టిగ ఉన్నది. జనసేన-బీజేపీ పొత్తు లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే . కానీ తిరుపతి లో జనసేన బాగా బలం గా ఉంది..పోటీ చేసిన చిరంజీవి గారు ఆ నియోజకవర్గం నుంచే గెలిచారు.ఇప్పుడు జనసేన ఉంటుందో లేక బీజేపీ బరిలోకి దిగుతుందో..అనే మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రజలని సందిగ్ధంలో పడివేసింది. అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ కి అంత లేదు అనే చెప్పాలి , ఎందుకంటే గట్టిగ మాట్లాడే నాయకులూ లేరు ఒకవేళ ఉన్న వాళ్ళల్లో సగం మంది వైస్సార్సీపీ కి మద్దతుగా మాట్లాడతారు..సగం మంది టీడీపీ వైపు మాట్లాడతారు..కొంతమంది జనసేన వైపు మాట్లాడాలన్నా మాట్లాడలేరు..కానీ పొలిటికల్ అనలిస్ట్ లు అంచనా వేసి జనసేన తిరుపతిలో నెగ్గాలి అని లేకపోతే జనసేన కి చాల నష్టం అని , బీజేపీ కొంగు చాటు పార్టీ గా ఉంటుంది అనే పేరు వస్తది అని చెప్తున్నారు , ఒకవేళ బీజేపీ ఓడిపోతే వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు అని..అంటున్నారు. చూడాలి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..
