మొత్తానికి పబ్ జీ (PUBG) తిరిగి భారత్ లోకి  అడుగుపెట్టబోతోంది, ముందు సంవత్సరం బాన్  ఐన తరువాత ఎప్పుడెప్పుడా అని యువత మొత్తం వేచి చూస్తున్నారు. ముందు సంవత్సరం కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో, చైనా చేసే అరాచకాలు, వాళ్ళు మన డేటా ని వాడుకునే అంశాలు బయటపడ్డ తరుణంలో, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లో పబ్ జీ బ్యాన్ అయింది.దీనిపై  చాలా మంది నెటిజన్లు, పబ్ జీ ని తిరిగి తేవాలని ఎంతగానో ఆరాటపడ్డారు. కానీ, ఈ విషయం మీద భారత ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది.

pubg indian version

ఏదైతేనేం, పబ్ జీ మళ్ళీ తిరిగి రాబోతోంది, అయితే కాస్త పేరు మార్చుకుని రాబోతోంది. ఇంతకముందు, ఉన్న పేరు ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్స్  ఇప్పుడు  బ్యాటిల్ గ్రౌండ్ ఇండియా గా మారి అందరి ముందుకు రాబోతోంది అని ఆ గేమ్ కి  సంబంధించిన  డెవలపర్స్  అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రీ- రిజిస్ట్రేషన్ గురించి, ఇంకా లాంచ్ డేట్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది. .

 

pubg indian version launch

 

pubg indian version launch

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *